Asianet News TeluguAsianet News Telugu

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల చిన్నచూపొద్దు : మంత్రి హరీశ్ పిలుపు

ప్రజలను చైతన్యం చేయడం కోసం డిసెంబర్ 1 న ఎయిడ్స్ దినోత్సవంగా (international aids day) జరుపుతున్నారని అన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు (harish rao) . ఎయిడ్స్ బాధితులను చిన్న చూపు చూడొద్దని, ఇప్పటికీ వివక్ష చాలా తగ్గిందని దానిని ఇంకా తగ్గించాలని హరీశ్ వ్యాఖ్యానించారు.

minister harish rao participated international aids day event in erragadda chest hospital
Author
Hyderabad, First Published Dec 1, 2021, 1:04 PM IST

ప్రజలను చైతన్యం చేయడం కోసం డిసెంబర్ 1 న ఎయిడ్స్ దినోత్సవంగా (international aids day) జరుపుతున్నారని అన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు (harish rao) . ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో (erragadda chest hospital) నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో అవగాహన పెరగటం వల్ల 90 శాతం మరణాలు తగ్గాయని.. ఎయిడ్స్ బాధితులను చిన్న చూపు చూడొద్దని, ఇప్పటికీ వివక్ష చాలా తగ్గిందని దానిని ఇంకా తగ్గించాలని హరీశ్ వ్యాఖ్యానించారు. గాలి ద్వారా, ముట్టుకుంటే ఎయిడ్స్ రాదన్న అవగాహన మరింత పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎయిడ్స్ శాతం 0.7,  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక చేపట్టిన నిరోధక చర్యల వల్ల 0.7 నుండి 0.4 శాతానికి తగ్గిందని హరీశ్ రావు చెప్పారు. ప్రభుత్వం 167 ఐసీటీసీ కేంద్రాలు నెలకొల్పిందని... 22 ప్రభుత్వ ఎ. ఆర్. టి చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు  అందిస్తోందని.. హెచ్. ఐ. వీ వ్యాధిగ్రస్థులకు నెలకు ఆసరా పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. 

ALso Read:Sirivennela Death : పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.. సిరివెన్నెలకు హరీశ్ రావు నివాళి

సీఎం కేసీఆర్ (kcr) ఆదేశాలతో ఎయిడ్స్‌, షుగర్ వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక  డయాలసిస్ కేంద్రాలు హైదరాబాద్ (hyderabad), వరంగల్ (warangal) లో ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఎయిడ్స్ కంట్రొల్, చికిత్స, అవగాహన కోసం ప్రభుత్వం 50 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని హరీశ్ రావు చెప్పారు. హై రిస్క్ గ్రూప్ వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని... ఎయిడ్స్‌పై పోరాటంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమైందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం, ఎన్జీవోలు, ప్రజలు అందరూ కలిసి ఎయిడ్స్ మహమ్మారిని తరిమేయాలని.. బాధితులను అందరం కలిసి కాపాడుకోవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. 

చెస్ట్ ఆసుపత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసే 1000 పడకల సూపర్ స్పషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని.. హైదరాబాద్ నలువైపులా నిర్మించే మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేస్తారని హరీశ్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రి సేవలు అందించాలన్నదే కేసీఆర్ ఆశయమని చెప్పారు. ఇక్కడి టిబీ వార్డుల్లో తిరిగి వైద్యులు, రోగులతో మాట్లాడానని... వైద్యం, ఆహారం, వసతుల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారని హరీశ్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios