తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. గాంధీ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ను శనివారం నాడు మంత్రి ప్రారంభించారు.
హైదరాబాద్:తెలంగాణలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. శనివారం నాడు Gandhi ఆసుపత్రిలో City Scan సెంటర్ ను మంత్రి Harish Rao ప్రారంభించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలోని ప్రతి ఒక్కరూ చేసిన సేవలు పలువురి మన్ననలను పొందాయని ఆయన గుర్తు చేశారు. కరోనా సమయంలో సుమారు 84 వేల మంది రోగులకు చికిత్స అందించినట్టుగా మంత్రి తెలిపారు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వైద్య సిబ్బంది గాందీ ఆసుపత్రిలో సేవలు అందించారని ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు చేతులెత్తేస్తే గాంధీ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది రోగుల ప్రాణాలను కాపాడారన్నారు. ఈ విషయమై ఓ రోగిత ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూను మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాంధీ ఆసుపత్రి అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ రూ. 176 కోట్లు మంజూరు చేస్తే రూ. 100 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు మంత్రి హరీష్ రావు, మరో రూ. 76 కోట్ల పనులను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని ఆయన తెలిపారు.
also read:Omicron: థర్డ్ వేవ్ ను ఎదుర్కోడానికి... పక్కా ప్రణాళికలతో సంసిద్దం..: తెలంగాణ వైద్యారోగ్య మంత్రి
45 రోజుల్లో ఎంఆర్ఐతో పాటు ఇతర అత్యాధునిక సౌకర్యాలను కూడా రోగులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రిలోనే రెండు మూడు రోజుల్లో క్యాతలిక్ సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు. 4కోట్ల 6 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందించామన్నారు. 95 శాతం మందికి కరోనా ఫస్ట్ డోస్ పూర్తైందని మంత్రి వివరించారు. సెకండ్ డోస్ 51 డోస్ పూరైందని ఆయన తెలిపారు.Omicron కేసులు నమోదైన దేశాల నుండి 3235లకు పైగా ప్రయాణీకులు Hyderabad కు వచ్చినట్టుగా మంత్రి తెలిపారు.వీరిలో 15 మందికి కరోనా సోకిందన్నారు. 13 మంది రిపోర్టుల్లో ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు.ఇంకా ఇద్దరి రోగుల రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. corona టెస్టుల సంఖ్యను మరింతగా పెంచుతామని ఆయన తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో మరో 200 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. నాలుగైదు నెలల్లోనే ఈ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.ఎలాంటి వైరస్ వచ్చినా మాస్క్ మనకు శ్రీరామరక్ష. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలన్నాచు.. రెండు డోసుల టీకాలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. కరోనా కేసులు పెరగకండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా మంత్రి హరీష్ రావు తెలిపారు.
