బీజేపీపై తెలంగాణ మంత్రి హరీష్ (Harish Rao) రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. BJP ఫేక్ వాట్సాప్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీపై తెలంగాణ మంత్రి హరీష్ (Harish Rao) రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. BJP ఫేక్ వాట్సాప్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ అంశంలో చూసిన తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఆలేరు నియోజకవర్గ యువజన విద్యార్థి సోషల్ మీడియా విభాగం సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందన్నారు. డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకునే వాళ్ల యూపీ అట్టడుగున ఉందని విమర్శించారు. ఇక్కడ బండి, గుండు మాటల చెప్పమంటే కోటలు దాటుతాయంటూ ఫైర్ అయ్యారు. తాము అడ్డుకుంటే ఒక్కరు కూడా బయట తిరగలేరని అన్నారు.

‘కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మేమంటే.. 7 లక్షల ఉద్యోగాలే ఖాళీ ఉన్నాయి అంటారు. కనీసం ఇదన్న ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. కానీ అవి కాకుండా రైల్వే, బ్యాంకుల్లో, డిఫెన్స్‌లో ఖాళీలు ఉన్నాయి. బండి సంజయ్‌కు దమ్ముంటే ఢిల్లీలో 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమని బిలియన్ మార్చ్ చేయి..’ అని హరీష్ రావు సవాలు విసిరారు.

‘రాజ్యాంగం గురించి సీఎం కేసీఆర్ తప్పుగా మాట్లాడలేదు. బీఆర్ అంబేడ్కర్ గారే.. తాను రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, అవసరం అయితే రద్దు చేయాలని అని చెప్పారు. దేశంలో రాజ్యంగం స్పూర్తి లేకుండా పోతుంది. అందుకే న్యాయం చేయాలని కోరుతున్నాం. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచాలి అంటే పట్టింకోరు. బీజేపీ అంటేనే కోతల పార్టీ.. అక్కడ కోతల తప్ప ఏం లేవు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే వాతల పెడతారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడానికి సిద్దంగా ఉన్నారు’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. 

కేంద్ర బడ్జెట్ తెలంగాణకు ఒక్కటన్న దక్కిందా అని ప్రశ్నించారు. తెలంగాణను కేంద్ర చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. ఇక్కడి బీజేపీ నేతలకు నైతికత లేదని విమర్శించారు. వాళ్ళే నలుగురు వస్తరు.. వాళ్ళే కొట్టుకుంటరు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తారని ఆరోపించారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నారు. బీజేపీ ఫేక్ ప్రచారానికి అంతకంటే గట్టి సమాధానం చెప్పాలని పిలునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా వారి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు.