Asianet News TeluguAsianet News Telugu

మోదీ జీ.. బీజేపీ నేతల తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేస్తాయి: మంత్రి హరీష్ రావు కౌంటర్

ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి  కౌంటర్ ఇచ్చారు.  దేశానికీ, తెలంగాణకు ఏం చేశారని తాము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోదీ జీ అంటూ విమర్శించారు. 

Minister Harish Rao Counter To PM Modi Comments
Author
First Published Nov 13, 2022, 10:37 AM IST

ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి  కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో పర్యటనలో భాగంగా బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. తాను అనితీని అంతమొందిస్తున్న క్రమంలో కొందరు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. రోజూ 2-3 కిలోల తిట్లు తిడుతున్నారని.. అవే తనకు పోషకాహారంగా మారుతాయని మోదీ తెలిపారు. అయితే ఈ కామెంట్స్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. అలా అయితే బీజేపీ నేతల తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని  చేసి ఉంటాయని వ్యంగ్యస్త్రాలు సంధించారు. దేశానికీ, తెలంగాణకు ఏం చేశారని తాము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోదీ జీ అంటూ విమర్శించారు. 

‘‘ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అంటున్నారు. ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోదీ జీ. దేశానికీ,  తెలంగాణకు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోదీ జీ’’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు. 

ఇక, బీజేపీ స్వాగత సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. కేసీఆర్ పేరు ఎత్తకుండా తెలంగాణ సర్కార్‌పై విమర్శలు చేశారు. తెలంగాణలో వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది పీపుల్స్ ఫస్ట్ ప్రభుత్వం అని.. ఫ్యామిలీ ఫస్ట్ అనే ప్రభుత్వం కాదని అన్నారు. ‘‘నేను అలసిపోలేదా అని కొన్నిసార్లు ప్రజలు నన్ను అడుగుతారు. నిన్న ఉదయం నేను ఢిల్లీలో ఉన్నాను. తరువాత కర్ణాటక, తమిళనాడులో.. సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకనున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను. రోజూ 2-3 కేజీల తిట్లు తింటున్నారు నేను రోజువారీగా పొందే తిట్లు నాకు పోషకాహారంగా పనిచేస్తాయని నేను వారికి చెప్తాను. నేను వాటిని ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తాను’’ అని మోదీ అన్నారు. 

 

‘‘గత 20-22 ఏళ్లుగా నాపై అనేక రకాల దూషణలను విన్నాను. వారు దుర్భాషల నిఘంటువు అయిపోయారు. వారికి చేయడానికి ఇంకేమీ లేదు కాబట్టి వారు అలా చేస్తారు’’ అని మోదీ పేర్కొన్నారు. మోదీని తిట్టండి, బీజేపీని తిట్టండి.. కానీ తెలంగాణ ప్రజలను దుర్భాషలాడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios