సిద్దిపేట: రాష్ట్రంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా కేసీఆర్ వందలాది పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ములుగులో టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. 

గజ్వేల్ లో హార్టీకల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ ఉందన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొండపోచమ్మ ప్రాజెక్టును అడ్డుకునేందుకు టీజేఎస్ నేత కోదండరాం చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 

ఎవరెన్ని కుట్రలు చేసినా వాటిని అధిగమించామని తెలిపారు.  ప్రస్తుతం కొండపోచమ్మ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఒక్క ఓటుతో నాలుగు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.