కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆహ్వానాన్ని తిరస్కరించినట్టుగా ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆహ్వానాన్ని తిరస్కరించినట్టుగా ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరవ్వడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐ ప్యాక్‌తో టీఆర్ఎస్ కలిసి పనిచేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, బీజేపీలకు లేదని విమర్శించారు. పీకే బీజేపీతో ఉంటే గొప్పోడు.. కానీ తాము పీకే సలహాలు తీసుకుంటే తప్పా అని ప్రశ్నించారు.
తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న రైతుబంధు, మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని అన్నారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దశ, దిశగా మారిపోయిందని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. పలు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస కూలీలు వస్తున్నారని చెప్పారు. డబుల్ ఇంజీన్ అని చెప్పుకుంటున్న యూపీ నుంచి కూడా తెలంగాణ కూలీలు వలస వస్తున్నారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ పాలనతో దేశంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని ఆరోపించారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు ప్రజాస్పందన లేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చెబుతారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై చర్చిస్తామని చెప్పారు.
