Asianet News TeluguAsianet News Telugu

జైపాల్ రెడ్డికి హరీష్ సవాల్...''కేవలం ఈ అంశంపైనే ఓట్లు అడుగుదామా?''

మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయాలతో చేపట్టిన ప్రధాన పథకాల్లో  కేసీఆర్ 6 శాతం చొప్పున ముడుపులు తీసుకొన్నారని  జైపాల్ రెడ్డి ప్రధానంగా ఆరోపించారు. ఈ ఎన్నికల్లో  కేసీఆర్ అవినీతి, టీఆర్ఎస్ సర్కార్ లంచగొండితనంపై ప్రధానంగా  ప్రస్తావిస్తామని  ఆయన ప్రకటించారు. అయితే జైపాల్ రెడ్డి ఆరోపణలపై మంత్రి హరీష్ రావు సీరియస్ స్పందించారు. తెలంగాణ లోని సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో చర్చకు సిద్దమా? అని హరీష్ ప్రశ్నించారు. కేవలం ప్రాజెక్టుల అంశంపైనే ఈ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉంది, మీరు సిద్దమేనా అంటూ హరీష్ మాజీ కేంద్ర మంత్రికి సవాల్ విసిరారు.

minister harish rao challenged jaipal reddy
Author
Hyderabad, First Published Oct 16, 2018, 4:13 PM IST

మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయాలతో చేపట్టిన ప్రధాన పథకాల్లో  కేసీఆర్ 6 శాతం చొప్పున ముడుపులు తీసుకొన్నారని  జైపాల్ రెడ్డి ప్రధానంగా ఆరోపించారు. ఈ ఎన్నికల్లో  కేసీఆర్ అవినీతి, టీఆర్ఎస్ సర్కార్ లంచగొండితనంపై ప్రధానంగా  ప్రస్తావిస్తామని  ఆయన ప్రకటించారు. అయితే జైపాల్ రెడ్డి ఆరోపణలపై మంత్రి హరీష్ రావు సీరియస్ స్పందించారు. తెలంగాణ లోని సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో చర్చకు సిద్దమా? అని హరీష్ ప్రశ్నించారు. కేవలం ప్రాజెక్టుల అంశంపైనే ఈ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉంది, మీరు సిద్దమేనా అంటూ హరీష్ మాజీ కేంద్ర మంత్రికి సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు తెలంగాణలోని ఒక్క ఎకరాకు కూడా సాగునీరివ్వలేదని హరీష్ విమర్శించారు. ఈ విషయంలో  జైపాల్ మాట్లాడినవన్నీ అబద్దాలేనని ఆయన మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టు విషయంలో రహస్యాలేమీ లేవని...అవన్నీ బహిరంగంగానే వెల్లడించామని హరీశ్‌రావు తెలిపారు.  ఈపీసీ పద్ధతిలో
కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టింది  తాము కాదని...ఆ చరిత్ర కాంగ్రెస్‌దేనని హరీష్ తెలిపారు.

గత కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం నవరత్న కంపెనీలను ఎంపిక చేసేవారని హరీష్ గుర్తుచేశారు. కేవలం వాటినే టెండర్లలో పాల్గొనేందుకు  అనుమతిచ్చేవారని...ఆ కంపెనీల్లో ఒక్క తెలంగాణ కంపెనీ ఎందుకు లేదో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉందని హరీశ్‌ అన్నారు. 
 
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభించిన  విధానాల వల్ల ఖజానాకు పదేళ్లలో రూ.2600 కోట్ల భారం పడిందని....అదే టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేపట్టిన టెండర్లలో రూ. 550 కోట్లు ఆదా చేసిందని హరీశ్‌రావు చెప్పారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని జైపాల్ రెడ్డికి హరీష్ సవాల్ విసిరారు. ఆయన ఎక్కడ చర్చిద్దామన్నా తాను అక్కడికి వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్లు హరీష్ ప్రకటించారు.   

సంబంధిత వార్తలు

ప్రాజెక్టుల్లో కేసీఆర్‌కు 6శాతం ముడుపులు, విచారణ: జైపాల్ సంచలనం

Follow Us:
Download App:
  • android
  • ios