ఇప్పుడు టీఆర్‌ఎస్ అధికారంలోకి రాదంటున్నాడని, ఈ సారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయన నిజమైన సన్నాసుల్లో కలుస్తాడని పేర్కొన్నారు.
లగడపాటి చేస్తున్న సర్వేలు నిజం కావని కొట్టిపారేశారు.. తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి మణికొండ ల్యాంకోహిల్స్ వద్ద జరిగిన టీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లగడపాటి ఓ జోకర్ అంటూ హరీశ్ రావు విమర్శించారు.
గతంలో తెలంగాణ రాదని.. వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని లగడపాటి ప్రకటించారని, అదే రకంగా తెలంగాణ వచ్చిందని ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ అధికారంలోకి రాదంటున్నాడని, ఈ సారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయన నిజమైన సన్నాసుల్లో కలుస్తాడని పేర్కొన్నారు.
తెలంగాణకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడని మాత్రమే ఆయనను తిడుతున్నామని ఆయన అన్నారు. తాము తిట్టేది చంద్రబాబు ని మాత్రమేనని.. ఏపీ ప్రజలను కాదని హరీశ్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలంతా ఒకటేనని ఆయన పేర్కొన్నారు.
