రేకుర్తిగుట్టను యాదాద్రిలా చేస్తాం : మంత్రి గంగుల కమలాకర్ (వీడియో)
రేకుర్తిగుట్టను (rekurthi gutta) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) . శనివారం రేకుర్తి ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రేకుర్తిగుట్టను (rekurthi gutta) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) . శనివారం రేకుర్తి ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా త్వరితగతిన పూర్తి చేయాలని గంగుల అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రి తరహాలోనే రేకుర్తి గుట్టను అభివృద్ది చేస్తున్నామని.. పనులన్ని పూర్తైతే స్వామి వారి క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతుందని గంగుల ఆశాభావం వ్యక్తం చేశారు.
రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయాన్ని (lakshmi narasimha swamy) యాదాద్రి (yadadri) తరహాలో తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసి... స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కరీంనగర్ రేకుర్తి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉందని గంగుల కమలాకర్ తెలిపారు. సుదర్శన చక్రంతో స్వయంభువుగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాలు ప్రపంచంలోనే రెండు ఉండగా... అందులో రేకుర్తి ఒకటని ఆయన వెల్లడించారు.
నాలుగు శతాభ్దాల చరిత్రకలిగిన ఈ పురాతన ఆలయాన్ని పట్టించుకునే వారు లేక పోవడంతో శిథిలావస్థకు చేరుకుందన్నారు. గుట్టపై ఉన్న ఈ ఆలయానికి సరైన దారి లేక పోవడంతో... స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారిందని మంత్రి తెలిపారు. గుట్ట పైకి ఘాట్ రోడ్డు నిర్మాణంతో పాటు ఆలయ అభివృద్దిపై దృష్టిని సారించామని గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకోసం 5 కోట్ల రూపాయలతో శిథిలావస్థకు చేరిన ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టమని తెలిపారు. అంతేకాకుండా మూడున్నర కోట్లతో గుట్టపై ఉన్న ఆలయానికి ఘాటు రోడ్డు నిర్మాణం చేపట్టారు.
"