తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ హాట్ టాపికగా మారాయి. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ హాట్ టాపికగా మారాయి. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ.. తెలంగాణపై విషయం చిమ్మే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. తెలంగాణ, ఏపీలో ఎన్ని గురుకులాలున్నాయో బొత్స తెలుసుకోవాలనిఅన్నారు. ఏపీలో 308 గురుకులాలు ఉంటే.. 25 వేల మంది చదువుతున్నారు. తెలంగాణలో 1,019 గురుకులాలు ఉంటే.. ఆరు లక్షల మంది చదువుతున్నారని చెప్పారు. ఏపీలో గురుకులాలు పదో తరగతికే క్లోజ్ అని విమర్శించారు. బొత్స తల ఎక్కడ పెట్టుకుంటారని అన్నారని ప్రశ్నించారు.
Also Read: చూచిరాతలు, కుంభకోణాలు.. : తెలంగాణ విద్యా వ్యవస్థపై బొత్స సంచలనం
తాము ఏపీ జోలికి వెళ్లలేదని.. కానీ వాళ్లు మాట్లాడుతున్నందుకు తాము ఏం చేశామనేది చెప్పుకొవాల్సి వస్తుందని అన్నారు. టీఎస్‌పీఎస్సీలో స్కామ్‌ను బయటపెట్టింది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఏపీలో ఉపాధ్యాయులు బదిలీలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. విద్యావ్యవస్థ మీద మాత్రమే తాము మాట్లాడుతున్నామని.. వేరే అంశాలపై తాము ఇంకా మాట్లాడటం లేదని చెప్పారు. తమ ప్రభుత్వం గురించి ఏపీకి ఏం అవసరం అని ప్రశ్నించారు.
Also Read: రాజధాని లేని రాష్ట్రం ఏపీ.. దందాలు చేసింది వాళ్లే: బొత్స వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్ ఫైర్
బొత్స మాటల వెనక జగన్ లేకుంటే.. వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తన మాటలకు బొత్స సాయంత్రంలోగా స్పందించాలని డిమాండ్ చేశారు. స్పందించిన తర్వాతే బొత్స హైదరాబాద్‌లో అడుగుపెట్టాలని అన్నారు. దొడ్డిదారిన తెలంగాణకు వచ్చే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. తెలంగాణ సంపదను ఎత్తుకెళ్లాలని చూస్తున్నారా? ప్రశ్నించారు. తాము పక్క రాష్ట్రంతో కయ్యం పెట్టుకోవాలని చూడటం లేదని అన్నారు. జగన్ సర్కార్ తమ జోలికి రావొద్దని అన్నారు.
