హైదరాబాద్‌లోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాల గురించి సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు రావ్ చేసిన కామెంట్స్ గురించి మీడియా ప్రతినిధులు మంత్రి గంగుల కమలాకర్‌ను ప్రశ్నించారు.అయితే అందుకు సమాధానమిచ్చిన మంత్రి గంగుల కమలాకర్.. హిమాన్షు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదని ఏపీ మంత్రి బొత్ససత్యానారాయణ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్నాయి. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బొత్స మంత్రి గంగుల కమలాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ, ఏపీలో ఎన్ని గురుకులాలున్నాయో బొత్స తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాల గురించి సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు రావ్ చేసిన కామెంట్స్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
అయితే అందుకు సమాధానమిచ్చిన మంత్రి గంగుల కమలాకర్.. హిమాన్షు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు. ఆ పాపం ఎవరిదని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కట్టించిన స్కూల్‌లు శిథిలావస్థలో ఉంటే వాటిని రిపేర్ చేస్తున్నామని అన్నారు. మన ఊరి- మన బడి కార్యక్రమం తీసుకొచి.. 16 వేల కోట్లు పెట్టి స్కూళ్లను ఆధునీకరణ చేస్తున్నామని చెప్పారు. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కట్టించిన బడులను తెలంగాణ వచ్చే వరకు పట్టించుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మన ఊరి- మన బడి కార్యక్రమం చేపట్టామని చెప్పారు.
తెలంగాణలో గురుకులాల్లో ప్రవేశాల కోసం ఎంత డిమాండ్ ఉందో తెలిసిందేనని అన్నారు. ఒక్క సీటు కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయని.. కానీ తాము పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. 70 ఏళ్ల దరిద్రం ఎనిమిదేళ్లలోనే పోదు కదా అని అన్నారు. ఇప్పటికే పలు పాఠశాల రూపురేఖలు మార్చామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు చిన్న వయసులోనే పెద్ద మనసును చాటుకున్నారు. గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను ఆధునికీకరించడంతో తన వంతు సాయం చేశారు. తాజాగా బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షు ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు తొలిసారి వచ్చిన్నప్పుడు, ఇక్కడి పరిస్ధితిని చూసి తాను కంటతడి పెట్టినట్లు హిమాన్షు చెప్పారు. అయితే హిమాన్షు స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల దుస్థితికి హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శనమంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
