కరీంనగర్: గ్రేటర్ పీఠం పై గులాబీ జెండా సొంతంగా ఎగురవేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. రేపు(శుక్రవారం) వెలువడనున్న జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల్లో 100 పైగా సీట్లు గెలుచుకుంటామని... మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ పీటాన్ని కైవసం చేసుకుంటామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొట్టి టిఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు మంత్రి గంగుల. 

''తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ. దేశానికే ఆదర్శంగా ఈ నగరాన్ని సీఎం కేసీఆర్ తయారు చేస్తున్నారు. ఈ విషయం నగర ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి వారి ఆశిస్సులతో ఎవరితో పొత్తు లేకుండానే, ఎక్స్ ఆఫీసీయో ఓట్లు కూడా అవసరం లేకుండా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం'' అని పేర్కొన్నారు.

''ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీపై బీజేపీ తప్పుడు ఆరోపణలు మానుకుంటే మంచిది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు'' అని మంత్రి గంగుల వెల్లడించారు.