Asianet News TeluguAsianet News Telugu

అప్పుడే ఈటలను ఎందుకు ప్రశ్నించలేదు?: హుజురాబాద్ ప్రజలతో మంత్రి గంగుల (వీడియో)

హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం మంత్రి గంగుల మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల గురించి తెలుసుకున్న ఆయన వీటన్నింటి గురించి మంత్రిగా వుండగా ఈటలను ఎందుకు నిలదీయలేదని అడిగారు.  

minister gangula kamalakar morning walk in huzurabad municipality akp
Author
Huzurabad, First Published Aug 4, 2021, 11:42 AM IST

కరీంనగర్‌: మీ సమస్యల గురించి ఇంతకాలం మంత్రిగా వున్న ఈటల రాజేందర్ ను ఎందుకు ప్రశ్నించలేదని హుజురాబాద్ ప్రజలను మంత్రి గంగుల కమలాకర్ అడిగారు. ఆయన కూడా నియోజకవర్గంలో సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు? అంటూ ఈటలను నిలదీశారు మంత్రి గంగుల. 

ఇవాళ(బుధవారం) ఉదయం హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్, బోర్నపల్లి గ్రామాల్లో మంత్రి గంగుల మార్నింగ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి కాలనీలో తిరుగుతూ సమస్యల గురించి తెలుసుకున్నారు. ఇంకా ఏమయినా సమస్యలుంటే చెప్పాలని స్థానికులను అడిగారు. 

వీడియో

ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి నర్సింగాపూర్ వాసులు మంత్రికి వివరించారు.చిలక వాగు పై బ్రిడ్జి నిర్మాణం, పెద్దమ్మ గుడి, బిరప్ప గుడి, ఇతర అభివృద్ధి, పింఛన్లు సమస్యలు మంత్రి కి ప్రజలు వివరించారు.  ఈ సమస్యలన్నింటిని  సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 

read more  మానవత్వమున్న మహా మనిషి కేసీఆర్... అందువల్లే గొప్ప సంకల్పం: మంత్రి గంగుల

స్థానికులతో గంగుల మాట్లాడుతూ... జిల్లా మంత్రిగా మీ సమస్యలు తీర్చే బాధ్యత తనదేనని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి, ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.  

హుజురాబాద్ ఉపఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపికి ఓటు వేయవద్దని స్థానిక ప్రజలను మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వమే గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలను పెంచి సామాన్యులపై భారాన్నీ మోపిందన్నారు. మహిళలు మళ్లీ కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించిందని గంగుల కమలాకర్ ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios