ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు.

ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. రేపు అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో రేపటి భేటీలో ఏం చర్చించాలన్న దానిపై కేసీఆర్.. మంత్రికి దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.