Asianet News TeluguAsianet News Telugu

ఈటల కారణంగానే హుజురాబాద్ వెనకపడింది.. మంత్రి గంగుల..!

ఈరోజు ఉదయం నియెజకవర్గ నేతలతో కలిసి హుజురాబాద్ ప్రజల్ని మార్నింగ్ వాక్లో కలుసుకున్నారు గంగుల, టౌన్ వీదుల్లో తిరుగుతూ ప్రజల్లో కలిసిపోయారు

Minister Gangula Kamalakar Comments on Etela In Huzurabad
Author
Hyderabad, First Published Oct 1, 2021, 3:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హుజురాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. టీఆర్ఎస్ ప్రచారం షురూ చేసింది. మంత్రి గంగుల కమలాకర్ ఈ రోజు ఉదయం నుంచే తన ఎన్నికల ప్రచారం షురూ చేశారు. తెల్లవారుజామున మార్నింగ్ వాకింగ్ వెళ్లి ఆయన ప్రచారం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడుతూ..  ఈటలపై విమర్శల వర్షం కురిపించారు.

కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చావునోట్లో తలపెట్టి తెచ్చిన తెలంగాణను అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబివ్రుద్ది చేస్తున్నారని మంత్రి గంగుల పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా ఈటెల రాజెందర్ నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డ హుజురాబాద్ పట్టణాన్ని 50కోట్ల నిధులతో అన్నిరకాలుగా అభివ్రుద్ది చేస్తున్నామన్నారు

నామినేషన్లు ఈరోజుతో ప్రారంభమవుతున్నాయని, ఇప్పటికే భీపామ్ ని గౌరవ ముఖ్యమంత్రిగారు అందించారని మంచిరోజు చూసుకొని గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేస్తామన్నారు, ప్రజలు, కులసంఘాల నేతలు, ఆటో యూనియన్ వాళ్లే స్వచ్చందంగా డబ్బులు జమ చేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఫీజు కడుతామన్నారని, దీంతోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ విజయం ఖాయమైందన్నారు. 

ఈరోజు ఉదయం నియెజకవర్గ నేతలతో కలిసి హుజురాబాద్ ప్రజల్ని మార్నింగ్ వాక్లో కలుసుకున్నారు గంగుల, టౌన్ వీదుల్లో తిరుగుతూ ప్రజల్లో కలిసిపోయారు, దుకాణాలు, సెలూన్లు, చిరువ్యాపారులు, గ్రౌండ్ల మార్నింగ్ వాకర్లతో కలిసి ముచ్చటించారు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు మద్దతివ్వాలో వివరించారు.

 గతంలో ఇక్కడికి వచ్చే సమయానికి హుజారాబాద్ అస్థవ్యస్తంగా ఉందని, సరైన రోడ్లు,తాగునీరు, పారిశుద్యం, ఆరోగ్య వసతులు, కుల సంఘాల కమ్యూనిటీ హాళ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లగానే నిధుల్ని మంజూరు చేసారని, మిగతా తెలంగాణకు దీటుగా హుజురాబాద్ని అభివ్రుద్ది చేయాలని ఆదేశించారని ఆ ప్రకారం 50కోట్ల నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, అన్ని కులసంఘాల ఆత్మగౌరవం పెంచేలా కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామన్నారు. 

ఈ అభివ్రుద్ది మరింత కొనసాగించేలా మరింత ఉత్సాహం ఇచ్చేలా ప్రజలు కారుగుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ని గెలిపించాలన్నారు. గతంలో హుజురాబాద్లో కారు గుర్తుకే ఓటేసామని ప్రజలు ఈ సందర్బంగా మంత్రితో తెలయజేసారు, ఈ సారి కారుగుర్తుపై పోటీచేస్తున్న వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గతంలో వచ్చిన మెజార్టీకన్నా పది ఓట్ల అత్యధికంగా వస్తాయన్నారు గంగుల. రాబోయే రోజుల్లో హుజురాబాద్ అభివ్రుద్ది భాద్యత తనదేనన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలతో పాటు, స్థానికులు పాల్గొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios