హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం నాడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.

సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత మంత్రి కేటీఆర్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.  మంత్రులిద్దరూ నేరుగా ప్రగతి భవన్ కు చేరుకొన్నారు.

గతంలో కూడ ఈటల రాజేందర్  సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుండి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలో మీడియా, సోషల్ మీడియా సంయమనంతో వ్యవహరించాలని కూడ మంత్రి ఈటల కోరిన విషయం తెలిసిందే.

మంత్రి ఈటల రాజేందర్ కేసీఆర్ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. అయితే ఆదివారం నాడు ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఎలాంటి పరిస్థఇతులు ఎదురైనా కూడ తన మనసును మార్చుకోలేదని ఆయన తేల్చి చెప్పారు.