తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఢిల్లీకి బయల్దేరారు. ఆయన వెంటన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా వున్నారు. కాగా, ఈ నెల 31వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్  బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకొన్నట్లుగా వార్తలు వచ్చాయి. బీజేపీ నేతలతో వరుసగా భేటీ అవుతున్న ఈటల రాజేందర్ కమలం గూటిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Also Read:బిజెపిలోకి ఈటెల అనుమానమే: ఆత్మగౌరవ పోరాటమే, భార్య సంకేతాలు

భూకబ్జా ఆరోపణలు రావడంతో కేబినెట్ నుండి ఈటల రాజేందర్ ను  కేబినెట్ నుండి కేసీఆర్ తప్పించారు. దీంతో పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ఈటల రాజేందర్ ను కలిశారు. గతకొన్ని రోజులుగా ఆయన  బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. అటు బీజేపీ హైకమాండ్ కూడా ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు సానుకూలంగా ఉంది.