Asianet News TeluguAsianet News Telugu

కృష్ణ లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూపర్ స్టార్ క్రిష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 

Minister errabelli dayakar rao condolence to veteran actor superstar krishna death
Author
First Published Nov 15, 2022, 3:03 PM IST

హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దివంగత సూర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మాలయా స్టూడియో అధినేత, మాజీ ఎంపీ, పద్మభూషణ్ కృష్ణ పార్థీవ దేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. కృష్ణ కుటుంబ సభ్యులు మహేష్ బాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, సుధీర్ బాబు తదితరులను మంత్రి పరామర్శించారు. వారిని ఓదార్చారు. 

Minister errabelli dayakar rao condolence to veteran actor superstar krishna death

తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... కృష్ణ లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. 350కి పైగా సినిమాలలో నటించిన అగ్రశ్రేణి నటుడు ఆయన అని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అనేక ప్రయోగాలతో నూతన ఒరవడిని సృష్టించారన్నారు.

వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయా: కృష్ణ పార్థీవదేహనికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళి

సూపర్ స్టార్ క్రిష్ణ తెలుగు సినిమా పరిశ్రమకు 50 ఏండ్ల పాటు సేవలు అందించారు. తెలుగు సినీమా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన బుర్రిపాలెం బుల్లోడు, అల్లూరి సీతారామరాజు, కౌబాయ్, జేమ్స్ బాండ్... వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానన్నారు.మంత్రి వెంట మాజీ ఎంపీ ప్రముఖ నటులు మురళీ మోహన్, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్ తదతరులు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios