Asianet News TeluguAsianet News Telugu

TS Assembly: నిధులు రాష్ట్రానివా, కేంద్రానివా..? ఆ చర్చే అనవసరం..: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణలో పల్లెలన్నీ ప్రగథి పథంలో నడుస్తంటే నిధులు కేంద్రానివా? రాష్ట్రానివా? అన్న చర్చ అనవసరం అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

minister errabelli dayakar rao comments on  villages development in telangana
Author
Hyderabad, First Published Oct 5, 2021, 1:00 PM IST

హైదరాబాద్: తమ ప్రభుత్వం హయాంలో తెలంగాణ (Telangana) పల్లెలు ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పేర్కొన్నారు. గ్రామాల్లోనూ  పారిశుధ్య పనులు చేపడుతుండటంతో ఆహ్లాదకరంగా మారి ఆరోగ్యకరంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంటే నిధులు కేంద్రానివా? రాష్ట్రానివా? అని చూడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పట్నం నరేందర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, మాధవనేని రఘునందన్ రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడారు. ఉపాధి హామీ నిధుల మన రాష్ట్ర వాటా మన హక్కని అన్నారు. దేశంలోనే అత్యధికంగా నిధులు వినియోగించుకుంటూ కూలీలకు 15కోట్ల పని దినాలను కల్పించి నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ప్రధాని మోదీకి చెందిన గుజరాత్ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని... సభ్యులు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

read more  తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి.. శాసనసభలో సీఎం కేసీఆర్ ఫైర్..

''పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో 12 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఒక వైకుంఠధామం ఉండేలా ప్రభుత్వం పనులను చేపట్టింది. 2 బర్నింగ్ ప్లాట్ ఫాంలు, ఆఫీస్, స్టోర్ రూము, మగవారికి మరియు ఆడవారికి వేర్వేరు టాయిలెట్లు, ఎలక్ట్రిసిటి, నీటి సౌలభ్యం ఉండేలా 12 వేల 769 గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాల పనులను చేపట్టాం. 12 వేల 769 గ్రామ పంచాయతీలకు గానూ 12 వేల 622 గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాల పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 147 వైకుంఠధామాల పనులు వేర్వేరు స్టేజ్ లలో నడుస్తున్నాయి. వాటిని కూడా ఈ అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేస్తాం. వీటికొరకు ఇప్పటివరకు 1 వెయ్యి 547 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది'' అని మంత్రి వెల్లడించారు. 

''పల్లె ప్రగతి ప్రోగ్రాంలో భాగంగానే ప్రభుత్వం వ్యర్థ పదార్థాల నిర్వహణను నిర్వహిచండానికి ప్రతి గ్రామానికి 2 లక్షల 30 వేల వ్యయంతో ఒక డంపింగ్ యార్డు చేపట్టాలని నిర్ణయించాం. పొడి చెత్తను రిసైక్లింగ్ చేయడానికి 6 బుట్టలు, ఒక వేర్పాటు షెడ్డుతో పాటు డ్రైయింగ్ ప్లాట్ ఫాం, 2 కంపోస్టు చాంబర్లు, 1 స్టోర్ రూము, 1 ఇంకుడుగుంత, టాయిలెట్ ఉండేలా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు పనులు చేపట్టడం జరిగింది. 12 వేల 769 గ్రామ పంచాయతీలకు గానూ 12 వేల 737 గ్రామ పంచాయతీలలో గ్రామీణ డంపింగ్ యార్డు పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 32చోట్ల పనులను ఈ అక్టోబర్ 2021 చివరి నాటికి పూర్తి చేస్తాం. వీటి కోసం ఇప్పటివరకు 319 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది'' అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios