మినీ మేడారం జాతర షురూ.. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ చిన్న జాతరకు సమయం ఆసన్నమయ్యింది. మండమేలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల దగ్గర ఈరోజు అంటే బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం అన్ని ఏర్పాటూ పూర్తి చేసింది.

ఇప్పటికే జాతరకు ఆలయ కమిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం 24వ తేదీనుంచి 27వ తేదీ వరకు ఈ జాతర జరగనుందని అధికారులు ప్రకటించారు. అయితే మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు కావడంతో అధికారులు జాతర కోసం అని ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
ఇదిలా ఉంటే అసలైన సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే మినీ మేడారం జాతరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం కోటి 52 లక్షల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య చెప్పారు. ఈ నిధులను వివిధ శాఖలకు కేటాయించి జాతరకు హాజరయ్యే భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నారు.