హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు గుణపాఠం నేర్పిస్తాయంటూ హెచ్చరించారు. తెలంగాణలో ప్రజాకూటమి పేరుతో చంద్రబాబు పర్యటించడంపై పరోక్షంగా అసదుద్దీన్ స్పందించారు. 
 
అంతేకాదు త్వరలో ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబుకు రెండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. 

తాను త్వరలో ఏపీలో పర్యటిస్తానని అసదుద్దీన్ ప్రకటించారు. అయితే ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తారు లేక ఎంఐఎం పార్టీ తరపున ప్రచారం చేస్తారా అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు.  అలాగే టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి దేశమంతా పర్యటించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. 

కాంగ్రెస్,బీజేపీయేతర కూటమికి ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే కాంగ్రెస్, బీజేపీకీ వ్యతిరేకంగా దేశమంతా ప్రచారం చేస్తామని రాష్ట్రాల హక్కులపై పోరాడతామన్నారు. తమ పోరాటానికి కలిసొచ్చే వారితో కూటమిగా ఏర్పడతామని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.

 

 ఈ వార్తలు కూడా చదవండి

అసద్‌తో కలిసి దేశ రాజకీయాలను మలుపు తిప్పుతా: కేసీఆర్