Asianet News TeluguAsianet News Telugu

ఈయనది కూడా  ‘బీకాంలో ఫిజిక్సే’ !

పీవీ సింధూను వాలీబాల్ ప్లేయర్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే

MIM MLA REFERS TO SINDHU AS VOLLEYBALL PLAYER

బీకాంలో ఫిజిక్స్ అనేది ఇప్పుడు సోష్ ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పదాలలో ఒకటి. మొన్నామధ్య ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తాను బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పడం అది నెట్ లో వైరల్ గా మారడం తెలిసిందే.

 

ఇప్పుడు దేశంలో అవగాహన లేని రాజకీయ నేతల గురించి కాస్త క్లుప్తంగా చెప్పేందుకు ఈ పదం బాగా ఉపయోగిస్తున్నారు.

 

ఏపీలోనే అనుకుంటే ఇప్పుడు తెలంగాణలోనూ బీకాంలో ఫిజిక్స్ నేతలు బాగానే బయటపడుతున్నారు.

 

ఒలింపిక్స్ విజేత, హైదరాబాద్ క్రీడాకారిణి పీవీ సింధూ .... ప్రపంచం మొత్తం తెలిసిన పేరు. ఒలింపిక్స్ విజయంతో దేశ క్రీడా చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. హైదారాబాద్ లో పుట్టిపెరిగిన ఈ అమ్మాయిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా సత్కరించింది.

 

అయితే పీవీ సింధూ ఏ క్రీడాకారణియో తెలియకుండానే మన హైదారబాదీ నేత ఒకరు ఆమె గురించి పొగుడేశారు. ఈ రోజు హైదరాబాద్ లో 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పీవీ సింధూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మజ్లీస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ తదితరులు కూడా వచ్చారు.

ఈ కార్యక్రమంలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌ ప్లేయర్ అయిన పీవీ సింధూను వాలీబాల్ ప్లేయర్ గా పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారందరూ ఒక్కసారిగా అవాక్కైయ్యారు.

 

ప్రపంచమంతా పీవీ సింధూ గురించి గొప్పగా చెబుతుంటే ఆమె పుట్టిపెరిగిన నగరంలోని నేతలకు ఆమె ఏ క్రీడాకారిణితో తెలియకపోవడం గమనార్హం. మన నేతల జనరల్ నాలెడ్జ్ కు ఇదో మచ్చు తునక అనుకోవచ్చు.  

 

ఈ వ్యాఖ్యల చేసిన ముంతాజ్ ఖాన్ పై అప్పుడే సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి.  ఏపీలోనే కాదు తెలంగాణలోనూ బీకాం లో ఫిజిక్స్ లకు కొదవలేదనే నిజాన్ని ఈ ఎమ్మెల్యే నిరూపించారు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios