తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ 16వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంతాజ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ అసెంబ్లీ సచివాలయం నోటీఫికేషన్ వెలువరించింది. ఆ రోజు సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఎంఐఎం పార్టీలో రెండు దశాబ్ధాలుగా క్రియాశీలకంగా పనిచేస్తోన్న ముంతాజ్ అహ్మద్..1994 నుంచి గత ఎన్నికల వరకు యాకుత్‌పురా నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2018 ఎన్నికల్లో ఆయన చార్మినార్ నుంచి గెలుపొందారు. తమపార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.