హైదరాబాద్: మేం తలుచుకొంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ను చిలక అంటూ ఆయన సెటైర్లు వేశారు.కేటీఆర్ చిలక నిన్న మొన్న రాజకీయాల్లో కళ్లు తెరిచాడని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.మజ్లిస్ పార్టీ చాలా మందిని చూసిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


మజ్లిస్ పార్టీ చాలా చూసిందన్నారు.కేటీఆర్ ఇటీవలే వచ్చారన్నారు. రాజకీయం మా ఇంటి గుమాస్తాతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. గత ఎన్నికల్లో పాతబస్తీలోని 5 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొంది.ఈ దఫా 10 స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది.టీఆర్ఎస్ పై ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తీసుకొన్న కొన్ని నిర్ణయాలకు ఎంఐఎం మద్దతును ప్రకటించింది. బీజేపీకి వ్యతిరేకంగా  దేశంలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని టీఆర్ఎస్, ఎంఐఎం కూడ గతంలో ప్లాన్ చేశాయి,. కానీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు.