తప్పుడు పత్రాలు సమర్పించి కార్పొరేటర్ గా పోటీ చేసిన ఎర్రగడ్డ (101) డివిజన్ ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక చెల్లదని టీఆర్ఎస్ అభ్యర్థి కె. పల్లవి తెలిపారు. 

శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన షహీన్ బేగం జీహెచ్ఎంసీకి తప్పుడు పత్రాలు సమర్పించిందని, సెక్షన్ 21బి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం షహీన్ బేగంకు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని, వెంటనే ఆమె ఎన్నికను నిలిపివేయాలన్నారు.

ఇప్పటికే సిటీ సివిల్ కోర్టులో ఓపి నం.2ఆఫ్ 2021 ప్రకారం పిటీషన్ దాఖలు చేశానని, దీంతో చీఫ్ జడ్జి ఆమెకు ఫిబ్రవరి 4న హియరింగ్ కోసం హాజరు కావాలని నోటీసులు సైతం జారీ చేశారన్నారు. ఈ విసయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల చేపట్టనున్న ప్రమాణ స్వీకారం చేయకుండా చూడాలని ఆమె కోరారు.