Asianet News TeluguAsianet News Telugu

ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన ఓవైసీ...కార్పోరేటర్‌కే దక్కిన అవకాశం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. శాసనమండలిలో ఏర్పడిన ఐదు స్థానాల భర్తీ  ఇటీవలే నోటిఫికేషన్ వెలువడింది. అయితే నాలుగు స్ధానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎం కేటాయించింది. ఈ నేపథ్యంలో తాజాగా తమ పార్టీ తరపున బరిలోకి దిగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసి ప్రకటించారు.

mim chief asaduddin owaisi announced mlc candidate
Author
Hyderabad, First Published Feb 25, 2019, 2:01 PM IST

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. శాసనమండలిలో ఏర్పడిన ఐదు స్థానాల భర్తీ  ఇటీవలే నోటిఫికేషన్ వెలువడింది. అయితే నాలుగు స్ధానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎం కేటాయించింది. ఈ నేపథ్యంలో తాజాగా తమ పార్టీ తరపున బరిలోకి దిగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసి ప్రకటించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ‌గా తమ పార్టీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీని ఎంపికచేసినట్లు ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసి తెలిపారు. ఈ మేరకు ఎంఐఎం పార్టీ తరపున అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం మీర్జా రీయాజ్  డబీర్ పుర కార్పోరేటర్ గా కొనసాగుతున్నారు. 

సీఎం కేసీఆర్ ఎంఐఎం కు ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించినట్లు ప్రకటించారు. దీంతో ఆ అవకాశం మరోసారి మాజీ ఎమ్మెల్సీలు అల్తాఫ్ హుస్సెన్ రిజ్వి, యాసర్ అరాఫత్ లకు రావచ్చని ప్రచారం జరిగింది. పార్టీ అధినాయకత్వం కూడా వారి పేర్లు పరిశీలించినట్లు తెలుస్తోంది. చివరకు అనూహ్యంగా డబీర్ పుర కార్పోరేటర్ మీర్జా రీయాజ్ ను ఎంపిక చేస్తూ ఎంఐఎం చీఫ్ నిర్ణయం తీసుకున్నారు. 

గత గురువారమే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నోటిఫికేషన్ వెలువడగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. టీఆర్ఎస్ పార్టీ తరపున హోం మంత్రి మహమూద్ ఆలీ, ఎగ్గె మల్లేశం, మైనింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ లకు ఎమ్మెల్సీలుగా బరిలోకి దిగననున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వారితో పాటు మీర్జా రియాజ్ కూడా ఇవాళ నామినేషన్ వేయనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios