తెలంగాణలో యాదవులకు ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సీటు ఇస్తామని ప్రకటించినందుకు సీమాంధ్ర యాదవులు పొంగిపోయారు. ఏకంగా కేసిఆర్ చిత్రపటానికి బెజవాడ కేంద్రంగా పాలాభిషేకం చేశారు. యాదవ యువ భేరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. కేసిఆర్ ఫొటోకు పాలు, పూలతో అభిషేకం చేశారు.

యాదవుల అభ్యున్నతికి కేసిఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ యాదవులకు సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేసి యాదవ బాంధవుడుగా మారిపోయిండని ఖితాబిచ్చారు. యాదవులకు 200 కోట్లతో భవనం నిర్మించి ఇస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

త్వరలోనే హైదరాబాద్ కు పోయి కేసిఆర్ కు ప్రత్యేక సన్మానం చేస్తామని యాదవ యువ భేరి నేతలు ప్రకటించారు. యాదవుల పాలాభిషేకం వీడియో కింద చూడొచ్చు.