లాక్ డౌన్ పొడిగింపు.. ఉప్పల్ లో బిహార్ వలస కూలీ ఆత్మహత్య
కూలీ పనుల కోసం హైదరాబాద్ వచ్చిన బిహార్ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎండీ అమీర్(24) మూడు నెలల క్రితం నగరానికి వచ్చాడు.
Hyderabad, First Published Apr 15, 2020, 9:29 AM IST | Last Updated Apr 15, 2020, 9:29 AM IST
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ముందుగానే స్పందించిన భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధిచింది. అయినా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. భారత్ లో పదివేల కేసులు దాటాయి. ఈ క్రమంలో మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించారు. అయితే.. ఈ లాక్ డౌన్ పొడిగింపు కారణంగా ఓ వలస కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కూలీ పనుల కోసం హైదరాబాద్ వచ్చిన బిహార్ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎండీ అమీర్(24) మూడు నెలల క్రితం నగరానికి వచ్చాడు.
ఒక మెకానిక్ షెడ్డులో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో అమీర్ తిరిగి వెళ్లలేకపోయాడు. దాంతో గదిలో ఒక్కడే ఉంటున్నాడు. శనివారం తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన అమీర్ మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.