Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ భయం: తెలంగాణ నుండి స్వంత ఊళ్లకు వలస కూలీల పయనం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో   వలసకూలీలు  తమ స్వంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. వలస కూలీలు తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల  వద్దకు చేరుకొంటున్నారు. 

migrant labourers return to home states from telangana lns
Author
Hyderabad, First Published Apr 22, 2021, 3:06 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో   వలసకూలీలు  తమ స్వంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. వలస కూలీలు తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల  వద్దకు చేరుకొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 20 వ తేదీ నుండి  నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం.  

దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారేమోననే  భయం వలస కూలీల్లో నెలకొంది.  హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఛత్తీస్ ఘడ్, ఒఢిశా, బీహార్ రాష్ట్రాల నుండి కూలీలు ఎక్కువగా వస్తారు. భవన నిర్మాణ పనులతో పాటు ఇటుక బట్టీల్లో కూలీలు పనిచేస్తారు. గత ఏడాది కూడ  కరోనా సమయంలో  కూలీలు  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుండి తమ స్వంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లున్నారు. 

 రాష్ట్రంలో ప్రతి రోజూ వేలాది కేసులు వెలుగుచూస్తున్నాయి. వైరస్ కనుక అదుపులోకి రాకుంటే లాక్‌డౌన్ తప్పదంటూ వార్తలు షికారు చేస్తున్న  నేపథ్యంలో హైదరాబాద్‌లోని వలస కార్మికులు స్వగ్రామాలకు పయనమవుతున్నారు. అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని సొంతూళ్ల బాటపడుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే తరలిపోతుండడంతో రాజధానిలోని శివారు ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయి.ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస కార్మికులు దాదాపు 18 లక్షల మంది వరకు ఉండగా వీరిలో దాదాపు 60 శాతం మంది వారం క్రితమే నగరాన్ని విడిచిపెట్టారు. మిగిలిన వారు కూడా వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు.

రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్న వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి  బయలుదేరే రైళ్లు నిండిపోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన, విశాఖపట్టణం వెళ్లే గోదావరి, కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్లు గత వారం రోజులుగా ప్రయాణికులతో కిక్కిరిసి వెళుతున్నాయి. ఇక ఆయా రైళ్లలో రిజర్వేషన్ నాలుగైదు రోజుల ముందే పూర్తయిపోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజుకు సగటున 2.60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, స్వగ్రామాలకు జనం తరలుతుండడంతో నగరంలోని రోడ్లు చాలా వరకు బోసిపోయి కనిపిస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios