Asianet News TeluguAsianet News Telugu

ధర్నాకు యత్నించిన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల అరెస్ట్.. వేములవాడలో తీవ్ర ఉద్రిక్తత

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్వాసితులు వేములవాడలో ధర్నాకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో  నంది కమాన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 

Mid Manair Project Oustees Protest in Vemulawada
Author
First Published Aug 29, 2022, 2:32 PM IST

మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నాకు యత్నించడం వేములవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు నంది కమాన్ వద్ద ధర్నాకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ధర్నాకు యత్నించిన నిర్వాసితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వేములవాడ నంది కమాన్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే పోలీసులు దాదాపు 200 మంది అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.  ఇక, ప్రాజక్ట్ కట్టిన నాటి నుంచి తమకు పూర్తి స్థాయి పరిహారం అందలేని నిర్వాసితులు చెబుతున్నారు. 

ఇక, మిడ్ మానేరు నిర్వాసితుల అరెస్ట్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. మిడ్ మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు. నిర్వాసితులకు కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 

మరోవైపు మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల అరెస్ట్‌ను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు. నిర్వాసితుల అరెస్ట్ దారుణమని అన్నారు. మిడ్ మానేరు ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలు, బీజేపీ నేతల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ముంపు గ్రామాల బాధితులపైనా పోలీసుల లాఠీఛార్జ్ చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. మహిళలు అని చూడకుండా అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. ముంపు గ్రామాల బాధితులపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం అని అన్నారు. వెంటనే అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు బాధితుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని అన్నారు. మిడ్ మానేరు బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios