కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. బల్దియా పరిధిలో 63 కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు

కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. బల్దియా పరిధిలో 63 కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు.

కంటైన్‌మెంట్ జోన్‌లను కట్టుదిట్టంగా అమలు చేయాలని కమీషనర్ లోకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. క‌నీసం 5 కేసులుంటే మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Also Read:తెలంగాణలో 24 గంటల్లో కరోనాతో 23 మంది మృతి: కొత్తగా 5,567 కేసులు

అపార్ట్మెంట్ లో ఉంటే హౌజ్ క్ల‌స్ట‌ర్ గా పిలుస్తార‌ని… ఈ ప్రాంతాల్లో నిరంత‌రం శానిటైజేష‌న్, వైద్య సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయ‌ని జీహెచ్ఎంసీ తెలిపింది. హైద‌రాబాద్ పై క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త భారీగా పెరుగుతుంది.

ప్ర‌తిరోజు వంద‌ల్లో కేసులు, ఇత‌ర రాష్ట్రాల నుండి చికిత్స కోసం కోవిడ్ రోగుల‌తో వైర‌స్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. మినీ కంటైన్మెంట్ జోన్ల‌తో వైర‌స్ స్ప్రెడ్ క‌ట్ట‌డి చేయాల‌ని కేంద్రం సూచించినా… గ్రేట‌ర్ లో అమ‌ల్లోకి రాలేదు.

కాగా, తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. నిన్న 2,251 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో వైపు రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 50వేలకు చేరువయ్యాయి