హైదరాబాద్: హైద్రాబాద్ మెట్రోలో మంగళవారం నాడు ఉదయం సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి. దీంతో రెండు కారిడార్లలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

అసెంబ్లీ స్టేషన్ నుండి ఎర్రమంజిల్ స్టేషన్ వరకు వెళ్లడానికి మెట్రో రైలు కనీసం 40 నిమిషాలు తీసుకొంటుంది. 30 నిమిషాల పాటు రైళ్లు రైల్వే ట్రాక్ పై నిలిచిపోయాయి.

రైళ్ల రాకపోకలు నిలిచిపోవడానికి సాంకేతిక సమస్యలు కారణమని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలను వెంటనే సరిచేసి రైళ్లను తిరిగి నడిపిచేందుకు  అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉదయం పూట మెట్రో రైళ్లలో పెద్ద ఎత్తున ప్రయాణీకులు ప్రయాణీస్తుంటారు. 

సాంకేతిక సమస్యల కారణంగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.