రాజస్థాన్ లో అంబులెన్స్ ఖర్చు భరించలేక కరోనాతో చనిపోయిన కూతురు మృతదేహాన్ని కారులో తీసుకెళ్లిన ఘటన మరువకముందే తెలంగాణలో అలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. 

ఖమ్మలోని ఆత్కూరు సమీపంలో అనారోగ్యంతో చనిపోయిన ఓ వృద్ధుడిని టూ వీలర్ మీద కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. 

వివరాల్లోని వెడితే..మల్లారానికి చెందిన ఎర్రనాగుల నారాయణ (70) అనే వృద్ధుడు వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి మధిరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించారు. ఈ క్రమంలో శుక్రవారం గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో.. కుటుంబసభ్యులు అతడిని మోటార్ సైకిల్ మీద మధిరకు తీసుకువస్తున్నారు. 

మార్గమద్యంలో సిరిపురం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చూపించుకోగా ఆయన మధిరలోని ఆస్పత్రిలో వైద్యం చేయించాలని సూచించాడు. దీంతో మోటార్ సైకిల్ మీదే మధిరకు తీసుకెల్తుండగా ఆత్కూరు దగ్గరికి వచ్చేసరికి.. ఒక్కసారిగా గుండెపోటు ఎక్కువవ్వడంతో మోటార్ సైకిల్ మీదే మృతి చెందాడు. 

వైరల్ : కరోనాతో చనిపోయిన కూతురు.. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లిన తండ్రి... !...

మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్దామనుకున్నారు. కానీ అంబులెన్స్ ను అధిక డబ్బులు వసూలు చేస్తుండడంతో.. అది భరించలేక అదే మోటారుసైకిల్‌పై ఇంటికి తీసుకెళ్లారు.