యశోదాలో వైద్య పరీక్షలు పూర్తి.. నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం: వ్యక్తిగత వైద్యుడు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సీటీ స్కాన్‌తో పాటు ఆరు రకాల పరీక్షలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. 

medical tests completed for telangana cm kcr in yashoda hospital ksp

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సీటీ స్కాన్‌తో పాటు ఆరు రకాల పరీక్షలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.

సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగానే వున్నాయని.. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్తపరీక్షల కోసం శాంపిల్స్‌ను తీసుకున్నట్లు చెప్పారు. రక్తపరీక్షలు రేపు రానున్నాయి.

సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే వుందని.. త్వరలో కోలుకుంటారని ఎంవీ రావు తెలిపారు. ఆయనకు కోవిడ్ లక్షణాలు పోయాయని.. పూర్తి ఆరోగ్యంగా వున్నారని, త్వరలోనే విధులుకు హాజర్యే అవకాశం వుందని డాక్టర్ చెప్పారు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగానే వున్నాయని ఎంవీ రావు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ నేరుగా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు బయల్దేరారు

Also Read:యశోదా ఆసుపత్రికి తెలంగాణ సీఎం కేసీఆర్... ఎర్రవల్లి నుంచి నేరుగా సోమాజిగూడకి

కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో కేసీఆర్ కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎంకు కరోనా సోకడం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు.

కొద్దిరోజుల క్రితమే ఆయన నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. మరోవైపు నోముల భగత్‌కు కూడా కరోనా సోకింది.

ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. ఫామ్ హౌస్‌లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నిపుణులైన వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios