గురువారం తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడుతూ 50 మంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు అస్వస్థతకు గురైయ్యారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్ధులెవ్వరికీ ఫుడ్ పాయిజిన్ కాలేదని మెడికల్ ఆఫీసర్ తెలిపారు.  

బాసర ట్రిపుల్ ఐటీలో (basara iiit) ఫుడ్ పాయిజన్ కాలేదన్నారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత. అస్వస్థతతో ఆరుగురే ఆసుపత్రిలో చేరారని ఆమె తెలిపారు. వాళ్లకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ (food poisoning) కాలేదని సుస్మిత అన్నారు. కాగా... తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడుతూ దాదాపు 50 మంది వరకు విద్యార్థులు గురువారం ఆస్పత్రుల్లో చేరారు. అయితే గతంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.. తరుచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బుధవారం రాజ్‌భవన్‌లో పలు యూనివర్సిటీల విద్యార్థి ప్రతినిధులతో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే బాసరకు ఐటీకి చెందిన విద్యార్థి ప్రతినిధి బృందం కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆహారం, అడ్మినిస్ట్రేషన్ గురించి సమస్యలను గవర్నర్ దృష్టికి విద్యార్థుల బృందం తీసుకెళ్లింది. 

ALso REad:బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్తులకు అస్వస్థత..

ఈ సందర్భంగా.. బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ పై గవర్నర్ Tamilisai Soundararajan ఆవేదన వ్యక్తం చేశారు.పుడ్ పాయిజన్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని గవర్నర్ చెప్పారు. తాను మీకు ఎంత సపోర్ట్ చేయగలనో అంత మేరకు సపోర్ట్ చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. తాను త్వరలోనే 75 కాలేజీలను సందర్శిస్తానని గవర్నర్ ప్రకటించారు. బాసర ట్రిపుల్ ఐటీని కూడా సందర్శిస్తానన్నారు.