Asianet News TeluguAsianet News Telugu

నో రోడ్స్.. నో వోట్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చేదు అనుభవం

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేత, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. తమ ప్రాంతంలో రోడ్లు వేయాలంటూ చుక్కలు చూపించారు యాప్రాల్ ప్రజలు.

medchal people angry on malkajgiri mla mynampally hanumantha rao for roads ksp
Author
Hyderabad, First Published Nov 22, 2020, 3:38 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేత, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. తమ ప్రాంతంలో రోడ్లు వేయాలంటూ చుక్కలు చూపించారు యాప్రాల్ ప్రజలు.

నో రోడ్స్.. నో వోట్స్ అంటూ ప్లకార్డులు చూపించారు. దాదాపు రెండు కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే సొంత నిధులతో రోడ్లు వేయిస్తానని లెటర్ పాడ్‌పై సంతకం చేసి ప్రమాణం చేశారు ఎమ్మెల్యే.

తాము ట్యాక్స్ కడుతున్నామని.. జీహెచ్ఎంసీ రోడ్లు  వేయాలని డిమాండ్ చేశారు. అయితే మీ సొంత నిధులు తమకు అక్కర్లేదని స్థానికులు తేల్చి చెప్పారు. అయితే స్థానికులు నచ్చచెప్పారు మైనంపల్లి హన్మంతరావు. 

Follow Us:
Download App:
  • android
  • ios