Asianet News TeluguAsianet News Telugu

మేడారంలో తీవ్ర విషాదం.. ఆలయ ప్రధాన పూజారి కన్నుమూత..

Medaram Priest: మేడారం సమ్మక్క-సారక్క ఆలయ పూజారుల్లో ఒకరైన సిద్దబోయిన లక్ష్మణ్‌రావు(43) అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన జిల్లాలోని మేడారంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

Medaram Sammakka priest Siddaboina Laxman Rao passed away KRJ
Author
First Published Oct 6, 2023, 5:49 AM IST

Medaram Priest: మేడారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క-సారక్క మహా జాతర పూజారి సిద్ధమైన లక్ష్మణ్ రావు(48) అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందారు.  గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనను దవాఖానకు తరలించి చికిత్స అందించారు. అనంతరం ఇంటి వద్దనే ఉంటూ మందులు వాడుతున్నాడు.

రెండు రోజుల క్రితం లక్ష్మణరావు పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో గురువారం ఉదయం మృతి చెందాడు. మేడారం సమ్మక్క-సారక్క ఆలయ పూజారి లక్ష్మణరావు మృతి పట్ల గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  సిద్ధబోయిన లక్ష్మణ్ రావుకు భార్య అనిత, పిల్లలు సౌమ్య, నితిన్ ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios