ప్రియుడితో కలిసి భర్తకు స్కెచ్.. ఫోన్ కాల్ తో గుట్టురట్టు!

వివాహేతర సంబంధం ఒక హత్యకు కారణమైంది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఒక తప్పు కారణంగా ఆలోచించకుండా వేసే తప్పటడుగులు ఎంత మంది జీవితాలపై ప్రభావం చూపిస్తాయో ఈ ఘటన మరొక ఉదాహరణగా నిలిచింది. 

medak murder case reveals phone call

ఒక వివాహేతర సంబంధం ఒక హత్యకు కారణమైంది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఒక తప్పు కారణంగా ఆలోచించకుండా వేసే తప్పటడుగులు ఎంత మంది జీవితాలపై ప్రభావం చూపిస్తాయో ఈ ఘటన మరొక ఉదాహరణగా నిలిచింది. మెదక్ జిల్లాకు చెందిన ఒక చిన్న కుటుంబంలో భార్య చేసిన పనికి వారి కుటుంబం చిన్నాభిన్నమైంది.

వివరాల్లోకి వెళితే.. పాపన్నపేట మండలం, కుర్తివాడకు చెందిన ముక్కుట్ల యాదాగౌడ్‌ (35), సౌజన్య భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఐదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చిన వీర గాగిల్లాపూర్‌లో నివాసముంటున్నారు. అయితే యాదాగౌడ్‌ ఆటో ఫైనాన్స్‌లో జీవనాన్ని కొనసాగిస్తుండగా స్థానిక డిసిఎం డ్రైవర్ షేక్‌ ఆసిఫ్‌తో మంచి స్నేహం ఏర్పడింది. అతను రోజు యాదాగౌడ్ ఇంటికి వస్తుండేవాడు.

ఈ క్రమంలో షేక్‌ ఆసిఫ్‌ - సౌజన్య ల మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమసంబంధానికి దారి తీసింది. అనుమానం వచ్చిన యాద గౌడ్ భార్యను హెచ్చరించాడు. అనంతరం ఆసిఫ్‌ ఒకరోజు యాదాగౌడ్ ని పార్టీ చేసుకుందామని చర్చి గాగిల్లాపూర్‌లోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో దాడి చేసి యాదాగౌడ్ ని హతమార్చాడు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే అసిఫ్ ని అరెస్ట్ చేయగా సౌజన్య మాట మార్చింది.  తన భర్తను కావాలనే అసిఫ్ చంపాడని పోలీసులకు తెలిపింది.

కొన్ని రోజుల అనంతరం అసిఫ్ అసలు విషయాన్నీ పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు వారు మాట్లాడుకున్న కాల్ డేటా ను పరిశీలించగా భర్త యాదాగౌడ్ హత్యకు అసలు సూత్రధారి సౌజన్య అని కనుగొన్నారు. రోజు తన భర్త వేధిస్తున్నాడని అతన్ని ఎలాగైనా హత్య చేయాలనీ అసిఫ్ కి సౌజన్య చెప్పినట్లు కాల్ సంభాషణలో బయటపడింది. ఏసీపీ నర్సింహరావు, సీఐ వెంకటేశం, ఎస్సై శేఖర్‌రెడ్డితో కలిసి ఘటన వివరాలు వెల్లడించారు. అసిఫ్ - సౌజన్యలపై కేసు నమోదు చేసి జైలుకి తరలించగా.. ఓ వైపు తండ్రి మరణం,, మరో వైపు తల్లి జైలు పాలవ్వడంతో వారి పిల్లలు అనాధలుగా మిగిలారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios