Sangareddy: మెదక్ కస్టడీ మృతి కేసులో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని డీజీపీ అంజనీకుమార్ శనివారం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ ను ఆదేశించారు. ఎండీ ఖ‌దీర్ ప‌ట్ల పోలీసులు ప్ర‌వ‌ర్తించిన‌ తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

Medak custodial death case: ఎండీ ఖదీర్ ఖాన్ (37) మృతి కేసులో మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ డి.మధు, ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుళ్లు ప్రశాంత్, పవన్ లను సస్పెండ్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖదీర్ ఖాన్ గత గురువారం మృతి చెందాడు. కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని డీజీపీ అంజనీకుమార్ శనివారం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ ను ఆదేశించారు.

ఏం జ‌రిగిందంటే. 

చైన్ స్నాచింగ్ కేసులో మ‌హ్మ‌ద్ ఖ‌దీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు తనను దారుణంగా హింసించారని ఆరోపించిన ఆయ‌న గురువారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో శ‌నివారం నాడు ఇందులో భాగ‌మైన‌ కొంతమంది పోలీసులపై దర్యాప్తు-క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్న‌తాధికారులు హామీ ఇచ్చారు. జనవరి 29న హైదరాబాద్ యాకుత్ పురాలో మహ్మద్ ఖాదిర్ (35) అనే వ్యక్తిని మెదక్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖాదీర్ మెదక్ టౌన్ నివాసి అయినప్పటికీ యాకుత్ పురాలో బంధువు వద్దకు వెళ్లాడు. జనవరిలో నమోదైన రెండు చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఖ‌దీర్ ను అనుమానించారు. ఈ క్ర‌మంలోనే అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు.

మెదక్ పోలీసులు తనను 5 రోజుల పాటు కొట్టారనీ, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారని మహమ్మద్ ఖదీర్ తన చివరి వీడియోలో ఆరోపించారు. మెదక్ పోలీసులు దారుణంగా హింసించడంతో తీవ్ర గాయాలపాలైన మహ్మద్ ఖదీర్ హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, ఒక దొంగతనం కేసులో అతని పాత్ర ఉన్నట్లు అనుమానిస్తూ మెదక్ పోలీసులు పట్టుకున్న 35 ఏళ్ల కార్మికుడి కస్టడీలో చిత్రహింసల కారణంగా మృతి చెందినట్లు ఆరోపించిన దర్యాప్తును పర్యవేక్షించాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ శనివారం పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.

Scroll to load tweet…

ఈ కేసును ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ చీఫ్ రెవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Scroll to load tweet…