టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హరీశ్ రావు వస్తారా.. లేదా అన్న చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో హరీశ్ రావు హాజరై తారక రామారావుకి తన అభినందనలు తెలిపారు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్‌కు గురయ్యారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేడి మొదలైంది. ముఖ్యంగా హరీశ్ రావు పరిస్థితి ఏంటీ..? ఆయన టీఆర్ఎస్‌ను చీలుస్తాడా..? బావకి అన్ని రకాలుగా సహయ సహకారాలు అందిస్తారా..? లేదంటే తన దెబ్బ తెలియజేస్తారా అంటూ రకరకాలగా జనం చర్చించుకుంటున్నారు.
కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేసిన రోజు..బావకి అభినందనలు తెలియజేస్తూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. కేటీఆర్ సైతం స్వయంగా హరీశ్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడి వచ్చారు. అయితే అప్పటికి పరిస్థితి బాగానే ఉన్నా.. పార్టీలో తనను పక్కనపెట్టే చర్యలు మొదలయ్యే మొదలయ్యాయన్న విషయాన్ని హరీశ్ రావు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తనను లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయించి రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం చేయనున్నారని హరీశ్ రావు భావిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే కొత్త కేబినెట్‌లో హరీశ్ రావుకు ఈసారి ప్రాధాన్యం లేని శాఖను కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా హరీశ్‌రావుకు మంచి గుర్తింపు ఉంది. పని రాక్షసుడిగా కష్టపడతారని పార్టీలో అంటూ ఉంటారు.
భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాజెక్ట్‌లను పరుగులు పెట్టించి పూర్తి చేయిస్తుండటంతో రాష్ట్ర ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. నగరాలు, పట్టణాల్లో కేటీఆర్‌కు ఇమేజ్ ఉంటే.. పల్లె సీమల్లో హరీశ్ ఛరిష్మా ముందు ఎవరైనా దిగదుడుపే. అలాంటి తన పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందన్న భయం హరీశ్‌ను వెంటాడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కేటీఆర్‌కి సహకరిస్తానని చెప్పిన హరీశ్ రావు ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరుకాలేదు. నాలుగున్నరేళ్లు ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్న హరీశ్ దీనికి హాజరవ్వకపోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి హరీశ్ తనంతట తాను రాలేదా..? లేదంటే కేసీఆర్ ఆహ్వానం పంపలేదా అన్న అనుమానాలు కలిగాయి.
అయితే ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హరీశ్ రావు వస్తారా.. లేదా అన్న చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో హరీశ్ రావు హాజరై తారక రామారావుకి తన అభినందనలు తెలిపారు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్‌కు గురయ్యారు.
హరీశ్ తన మావయ్యతో రాజీకీ వచ్చాడా.. లేదంటే ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కనబెట్టి మంత్రివర్గ విస్తరణ తర్వాత స్టెప్ తీసుకుంటారా అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హరీశ్ ప్రస్తుత మౌనం.. ఆయన మనసు మార్చుకున్నాడా..? లేక తుఫానుకు ముందు నిశ్శబ్ధమా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
