హైదరాబాద్‌లో వాస్తు నిపుణుడి ఇంట్లో భారీ చోరీ.. రూ. 3.93 కోట్ల నగదు, 450 గ్రాముల బంగారం అపహరణ
హైదరాబాద్ మధురానగర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. వాస్తు నిపుణుడు వీఎల్‌ఎన్ చౌదరి నివాసం ఉంటున్న ఇంట్లో ఈ చోరీ జరిగింది.
హైదరాబాద్ మధురానగర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. వాస్తు నిపుణుడు వీఎల్‌ఎన్ చౌదరి నివాసం ఉంటున్న ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో నుంచి 3.93 రూపాయలు, 450 గ్రాముల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగివచ్చేసరికి చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి కొనుగోలు కోసం ఉంచుకున్న డబ్బును దుండగులు ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధిచి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇక, వాస్తు నిపుణులు వీఎల్ఎన్ చౌదరి ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇంటి యజమాని ఖాళీ చేయమని చెప్పడంతో సొంత ఇళ్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే డబ్బును ఇంట్లో దాచి ఉంచాడు. అయితే ఈ నెల 12వ తేదీన ఉదయం బయటకు వెళ్లిన వీఎల్ఎన్ చౌదరి.. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తిరిగి వచ్చాడు. అయితే చోరీ జరిగినట్టుగా గుర్తించారు. రూ. 3.93 కోట్లు, 450 గ్రాముల బంగారు కడ్డీలు, 3 ల్యాప్‌ట్యాప్‌లు, విలువైన పత్రాలు చోరీకి గురైనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.