నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం, తొమ్మిది మంది మృతి, ఆరుగురి పరిస్థితి విషమం....

పటాకులు కాల్చడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని.. అయితే, ఎవరు చేశారో తెలియదని స్థానికులు చెబుతున్నారు. 

Massive fire in Nampally, six dead  - bsb

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సోమవారం ఉదయం 9.45 ని.ల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లి బజార్ ఘాట్ లో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లుగా సమాచారం. ప్రమాదంలో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు, ఒక చిన్నారి ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఓ అపార్ట్ మెంట్ కింది భాగంలో గత కొన్నేళ్లుగా ఈ కెమికల్ గోడౌన్ ఉంది. అది జీ ప్లస్ 4 అంతస్తుల భవనం. ఉదయం వేళ మంటలు వ్యాపించి.. పొగలు సెకన్లలో 4వ అంతస్తుకు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి పోలీసులు, ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ భవనంతో మొత్తం 60మంది నివాసం ఉంటున్నారు. కెమికల్ అంటుకుని పొగలు 4వ అంతస్తు వరకు వ్యాపించాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. 

పటాకులతోనే అగ్ని ప్రమాదం జరిగిందని.. అయితే, ఎవరు చేశారో తెలియదని స్థానికులు చెబుతున్నారు. మంటలు ఫ్యాక్టరీలోని నాల్గవంతస్తు వరకు వ్యాపించాయి. ఘటనా స్థలం బయట పార్క్ చేసిన 6 టూవీలర్లు, ఓ కారు దగ్థం అయ్యాయి. అయితే, మరోవైపు పోలీసులు ఏమంటున్నారంటే.. 16మందిని రెస్క్యూ చేశామని తెలిపారు. కెమికల్స్ వల్లే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని అంటున్నారు. 

ఈ గోడౌన్ పక్క బిల్డింగుకు కూడా మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను, మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ గోడౌన్లో డీజీల్ లాంటివి స్టోర్ చేశారని, నిప్పురవ్వ దానిమీద పడడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. భవన యజమాని రమేష్ జైశ్వాల్ గురించి పోలీసులు వెతుకుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios