Asianet News TeluguAsianet News Telugu

భర్తకు బుద్ది చెప్పాలని... ఇంటికే కన్నం వేయించిన భార్యకి దొంగల షాక్

భర్తపై కోపంతో అతనికి బుద్ధి చెప్పాలనుకున్న భార్య తన ఇంటికే కన్నం వేయించింది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌కు చెందిన వేణుగోపాల్, సునీత భార్యాభర్తలు, వీరికి ముగ్గురు పిల్లలు. తాగుడికి బానిసైన వేణుగోపాల్ తరచూ ఇంటికి తాగి వస్తుండటంతో పాటు కొన్ని విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. 

married women Robbery in her own house
Author
Hyderabad, First Published Nov 23, 2018, 1:15 PM IST

భర్తపై కోపంతో అతనికి బుద్ధి చెప్పాలనుకున్న భార్య తన ఇంటికే కన్నం వేయించింది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌కు చెందిన వేణుగోపాల్, సునీత భార్యాభర్తలు, వీరికి ముగ్గురు పిల్లలు. తాగుడికి బానిసైన వేణుగోపాల్ తరచూ ఇంటికి తాగి వస్తుండటంతో పాటు కొన్ని విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి.

దీంతో భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో సునీత తన బంధువులు సాయికుమార్, శివలతో కలిసి కుట్ర పన్నింది. దీనిలో భాగంగా ఈ నెల 4న ఆమె తన ముగ్గురు పిల్లలను తీసుకుని మల్కాజ్‌గిరిలోని పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆ తర్వాత ఈ నెల 7న వేణుగోపాల్ తన భార్య వద్దకు వెళ్లి ఇంటికి రావాల్సిందిగా వేడుకుని.. తుకారాంగేట్‌లోని తన తల్లి వద్దకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం.. ఈ నెల 8న సాయంత్రం శివ, సాయికుమార్‌లు సునీత ఇంటి తాళాలు పగులగొట్టి నగదు, బంగారాన్ని తీసుకెళ్లాడు.

కొద్దిరోజుల పాటు వాటిని తమ వద్దే ఉంచుకుని ఆమె భర్తను ఇబ్బందిపెట్టాలని భావించారు. తొమ్మిదో తేది ఉదయం వేణుగోపాల్ ఇంటి పక్కింటివారికి అతని ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో అతనికి సమాచారం అందించారు.

వెంటనే ఇంటికి చేరుకున్న వేణుగోపాల్ ఇంటిని పరిశీలించి చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న సునీత దొంగతనాన్ని తట్టుకోలేక స్పృహతప్పి నటించి తనపై అనుమానం రాకుండా జాగ్రత్తపడింది.

దొంగతనం జరిగిన తీరును బట్టి ఇది తెలిసిన వారి పనిగా నిర్థారించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. వారి అనుమానం సునీత మీదకు మళ్లడంతో ఆమె ఈ నెల 10న శివ, సాయిలను సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ వద్ద కలుసుకున్నారు.

శివ తన వద్దవున్న డబ్బు, నగదును వారికి అందించి వెళ్లిపోయాడు.. అనంతరం సొమ్ముతో పాటు సాయి, సునీత పూణే వెళ్లిపోయారు. గురువారం తిరిగి సికింద్రాబాద్ చేరుకున్న వీరు రేతిఫైల్ బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో గోపాలపురం పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. దొంగతనం చేసిన వ్యక్తిని గుర్తించి అతను రైళ్లో వెళ్తున్నాడని తెలిసి.. పుణే దాకా వెంబడించి పట్టుకొచ్చానని మాయమాటలు చెప్పింది. వీరిద్దరని పోలీసులు వేరు వేరుగా విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో సునీత, సాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 8.76 లక్షల నగదు, 5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడు శివ.. తాను చోరీకి పాల్పడిన నగదులో 1.20 లక్షలు నొక్కేసి.. మిగిలిన మొత్తాన్ని సునీతకు ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతనిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios