హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. వివాహితకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు శ్రీధర్ రెడ్డి అనే కామాంధుడు. బాధితురాలు స్పృహకోల్పోయిన తర్వాత నగ్న వీడియోలు తీసి వాటి సాయంతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.

ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ గౌడ్‌ను పట్టుకున్నారు.