భర్త ఎలాగూ లేడు కదా.. అవసరాలకు పనికివస్తాడని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఓ మహిళ. చివరకు ఆ ప్రియుడే ఆమెను అతి కిరాతకంగా కడతేర్చాడు. ఈ సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

డీఎస్పీ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ కి చెందిన మంజుల(35) లకి వివాహం అయింది. కాగా.. మూడేళ్ల క్రితం ప్రమాదంలో భర్తను కోల్పోయింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసింది.

కాగా.. ఈ బంధాన్ని అడ్డుపెట్టుకొని మంజుల... రాజశేఖర్ దగ్గర దాదాపు రూ.80వేలు తీసుకుంది. డబ్బు విషయం అడిగిన ప్రతిసారీ.. ఎదో ఒక మాయమాటలు చెప్పి తప్పించుకునేది. డబ్బు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న రాజశేఖర్.. ఈ నెల 9న రాత్రివేళ.. మంజులను తీసుకొని వ్యవసాయ పొలానికి వెళ్లాడు.

ఆమెతో కలిసి ఫూటుగా మద్యం సేవించి.. మళ్లీ డబ్బు విషయం తీసుకువచ్చాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో నరికి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తర్వాతి రోజు ఉదయం ఆమె శవమై కనిపించడాన్ని గ్రామస్థులు గుర్తించాడు. ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా.. రాజశేఖరే హత్య చేసినట్లు తేలింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.