Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌కు టీపీసీసీ... ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. 

marri sasidhar reddy resigned as tpcc election co coordination committee chairman ksp
Author
Hyderabad, First Published Jun 27, 2021, 6:40 PM IST

టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. 

మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది. రేవంత్‌కు పదవిని ఇవ్వడంపై ఓ వర్గం రగులుతోంది. ఇప్పటికే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ ఫైర్ అయ్యారు. 

ఇకపై తాను గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని కోమటిరెడ్డి సూచించారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తాను తన నియోజకవర్గం, జిల్లాకే పరిమితమవుతానని కోమటిరెడ్డి వెల్లడించారు. సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని ఆయన స్పష్టం చేశారు. పీసీసీని ఇన్‌ఛార్జి అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 

Also Read:అసంతృప్తులతో మాట్లాడుతున్నాం:షబ్బీర్ అలీ

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తులుగా ఉన్న సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో పడింది హైకమాండ్. వారిని ఎలాగైనా బుజ్జగించాలని భావిస్తోంది. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నచ్చచెప్పే పనిలో పడ్డారు ఢిల్లీ పెద్దలు. కోమటిరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే ఛాన్స్‌ అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం చివరి వరకు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి పోటీ పడ్డారు. ఎవరూ ఊహించని వ్యక్తులకు పదవులు రావడంపై అసంతృప్తులు పెల్లుబుకుతాయని హైకమాండ్ భావిస్తోంది. అసంతృప్తులు ఎవరూ పార్టీని వీడకుండా..ఉండేందుకు నష్టనివారణ చర్యలు చేపడుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios