Asianet News TeluguAsianet News Telugu

హరిభూషణ్ మృతి: ధృవీకరించిన మావోయిస్టు పార్టీ

  మావోయిస్టు పార్టీ అగ్రనేత యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మరణించినట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. హరిభూషణ్ మరణించినట్టుగా పోలీసులు ప్రకటించిన మరునాడే మావోయిస్టు పార్టీ కూడ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 

Maoists confirm death of Haribhushan and Bharatakka lns
Author
Hyderabad, First Published Jun 24, 2021, 3:21 PM IST

హైదరాబాద్:  మావోయిస్టు పార్టీ అగ్రనేత యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మరణించినట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. హరిభూషణ్ మరణించినట్టుగా పోలీసులు ప్రకటించిన మరునాడే మావోయిస్టు పార్టీ కూడ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో హరిభూషణ్ మరణించినట్టుగా మావోయిస్టు పార్టీ తెలిపింది.  మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం మాడ్ డివిజన్ , ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యులు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్కలు కరోనాతో మరణించారని మావోయిస్టు పార్టీ తెలిపింది.మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ప్రకటన జారీ అయింది. 

హరిభూషణ్ చాలా కాలంగా  బ్రాంకైటీసీ, అస్తమా వ్యాధులతో బాధపడుతున్నారని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ నెల 21న హరిభూషణ్ మరణించినట్టుగా జగన్ ఆ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న  సారక్క మరణించిందని జగన్ వివరించారు. ఈ నెల 22న వీరిద్దరి పేరిట సంస్మరణ సభ నిర్వహించినట్టుగా మావోయిస్టు పార్టీ తెలిపింది.మృతుల కుటంబాలకు పార్టీ తరపున సంతాపం తెలిపింది.

మావోయిస్టు పార్టీ కీలక నేతలు కరోనాతో బాధపడుతున్నట్టుగా వరంగల్ లో  ఈ నెల 2న పోలీసులకు గడ్డం మధుకర్  తెలిపారు. అడవిలో ఉన్న మావోయిస్టులు కరోనాతో ఇబ్బందిపడుతున్నారని ఆయన తెలిపారు. మధుకర్ ను పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధుకర్ ఈ నెల 6న మరణించాడు. మధుకర్ ను పోలీసులే చంపారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios