శాసనసభ్యురాలిగా, ప్రజా ప్రతినిధిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అని, వారెవ్వరూ పస్తులు ఉండకూడదు అని భావించిన సీతక్క ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, తన సిబ్బందితో పాటుగా ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి నిత్యావసరాలను అందిస్తూ, వారి ఆకలిని తీరుస్తున్నారు. 

లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది సామాన్య ప్రజలు తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో ఉన్న వారి పరిస్థితే ఇలాగుంటే.... ఇక కొండా కోనల్లో, అడవి ప్రాంతాల్లో ఉండే గిరిజనుల పరిస్థితిని వేరుగా చెప్పనవసరం లేదు. 

వారి బాధలను అర్థం చేసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క వారికోసం తన సిబ్బందిని వెంటపెట్టుకొని ఆ అడవుల్లో, ఆ ఏర్లను దాటుతూ ఆ మూలల్లో ఉన్న ప్రజల ఆకలి తీరుస్తున్నారు. 

Scroll to load tweet…


ఒక శాసనసభ్యురాలిగా, ప్రజా ప్రతినిధిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అని, వారెవ్వరూ పస్తులు ఉండకూడదు అని భావించిన సీతక్క ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, తన సిబ్బందితో పాటుగా ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి నిత్యావసరాలను అందిస్తూ, వారి ఆకలిని తీరుస్తున్నారు. 

ఇలా నడుస్తున్న ఒక ఫోటోను షేర్ చేసి, తాను మావోయిస్టుగా ఉన్నప్పటి అనుభవాలను నెమరువేసుకుంది. సీతక్క అప్పట్లో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేది. ఆమె దాదాపుగా ఆరు ఎన్కౌంటర్లలో ప్రాణాలతో బయటపడగలిగింది. దళ కమాండర్ గా ఈ ములుగు ప్రాంతంలో ఆమె పనిచేసారు. 

Scroll to load tweet…

ఆ తరువాత ఆమె లొంగిపోయి లా పూర్తి చేసారు. లా తరువాత ఆమె వరంగల్ కోర్టులో కూడా లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేసారు. ఇక ఇప్పుడు ఆ మారుమూల ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలను కాలినడకన చేరుకుంటూ అప్పట్లో తుపాకీతో తిరిగిన తాను, ఇప్పుడు నిత్యావసరాలతో తిరుగుతున్నానని ట్విట్టర్లో తన అనుభవాలను పంచుకున్నారు.