మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన రావుల రంజిత్ పోలీసులకు లొంగిపోయారు. ఆయన తండ్రి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీకాంత్ ఇటీవల మరణించారు. అప్పటి నుంచి రంజిత్ మావోయిస్టులకు దూరంగా ఉంటున్నారు.
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన రావుల రంజిత్ పోలీసులకు లొంగిపోయారు. ఆయన కొద్ది కాలంగా మావోయిస్టు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇందులో భాగంగా మావోయిస్టు బెటాలియన్ కమిటీ చీఫ్ గా పనిచేస్తున్నారు. దీంతో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది.
Add Asianetnews Telugu as a Preferred Source

రావుల రంజిత్ సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీకాంత్ కుమారుడు. కొద్ది కాలం క్రితం రావుల శ్రీకాంత్ మరణించారు. శ్రీకాంత్ మరణించిన తర్వాత రంజిత్ పార్టీకి దూరమయ్యారు.
