Asianet News TeluguAsianet News Telugu

షాక్: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య శారదక్క లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్యే శారదక్క.  అనారోగ్యంతో  హరిభూషణ్ మరణించిన విషయం తెలిసిందే. హరిభూషణ్ కొడుకు కూడ లొంగిపోయాడు.

maoist Sharadakka surrendered in front of Telangana DGP Mahender Reddy
Author
Hyderabad, First Published Sep 17, 2021, 10:37 AM IST


హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత  హరిభూషణ్ భార్య సమ్మక్క అలియాస్ శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారదక్క కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.గతంలో చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా ఆహె పనిచేశారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం గ్రామం.

1994లో పీపుల్స్‌వార్ పార్టీకి ఆమె ఆకర్షితురాలై పార్టీలో చేరింది.  కరోనాతో హరిభూషణ్ ఇటీవల కాలంలో మరణించాడు. హరిభూషణ్ కొడుకు ఇటీవలనే పోలీసులకు లొంగిపోయాడు.  శారదక్క లొంగుబాటు గురించి డీజీపీ ఇవాళ  మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు మావోయిస్టు అగ్రనేతలు ఇబ్బంది పడుతున్నారు. అడవి నుండి బయటకి వచ్చినవారికి వైద్య చికిత్స అందిస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. చికిత్స కోసం వచ్చిన మావోయిస్టు నేతలు చికిత్స పొందుతూ  మరణించిన విషయం కూడ తెలిసిందే.కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో రిక్రూట్  మెంట్ తగ్గిపోయింది. రిక్రూట్ మెంట్ కోసం  ప్రయత్నాలు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios